Nalgonda: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే!
Nalgonda: రోడ్డు ప్రమాదంలో గాయపడి దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంజయ్యను ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Nalgonda: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే!
Nalgonda: చందంపేట మండలం రేకులగడ్డ గ్రామానికి చెందిన కడ్తాల అంజయ్య ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి గాయపడగా, దేవరకొండలోని సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆసుపత్రికి వెళ్లి అంజయ్యను పరామర్శించారు.
ఈ సందర్భంగా వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంజయ్యకు మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా అవసరమైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. గాయపడిన వ్యక్తి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుక జలందర్ గౌడ్, సన్నాయిల ఉమామహేశ్వర్, కేతావత్ భధ్య నాయక్, చిలకల అంజయ్య, కేతావత్ రమేష్ నాయక్, బక్కతట్ల వెంకటయ్య, కేతావత్ లాల్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




