Devarakonda: ఒక్క రోడ్డు వేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా బాలునాయక్

Devarakonda: పెద్దఅడిచర్లపల్లిలో గత 15 ఏళ్లలో ఒక్క రోడ్డు వేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే బాలునాయక్ సవాల్.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 1 Sept 2026 3:47 PM IST
Devarakonda
X

Devarakonda: ఒక్క రోడ్డు వేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా బాలునాయక్

Devarakonda: నల్లగొండ జిల్లా దేవరకొండ 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నియోజకవర్గ పరిధిలోని పెద్దఅడిచర్లపల్లిలో ఒక్క రోడ్డు వేసినట్టు నిరూపిస్తే నేను ఇక్కడికిక్కడే రాజీనామా చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాజీ ఎమ్మెల్యే కు సవాల్ విసిరారు.

దేవరకొండ పట్టణంలోని సాయి రమ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దేవరకొండ నియోజకవర్గం లో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు.

దేవరకొండకు ఆర్టీవో కార్యాలయాన్ని తీసుకువచ్చానని అలాగే దేవరకొండ నియోజకవర్గం లో సర్వాంగ సుందరంగా రోడ్లను నిర్మిస్తున్నట్లు అలాగే నూతనంగా ఏర్పడ్డ మండలాలతో పాటు అన్ని మండలాల పరిధిలో ప్రజల, అధికారుల సౌకర్యార్థం ప్రభుత్వ కార్యాలయాల ను నిర్మాణం చేపడుతున్నామని ఆర్టీవో కార్యాలయాన్ని కూడా మంజూరు చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

పెద్దఅడిచర్లపల్లిలో నేను వేసిన రోడ్లు తప్ప 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఒక్కరోడ్డు కూడా వేయలేదని, ఒక్క రోడ్డు వేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే బాలునాయక్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA

Next Story