Devarakonda: నారాయణదాసు శ్రావణ్ మృతి బాధాకరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Devarakonda: పీఏ పల్లి గ్రామానికి చెందిన నారాయణదాసు శ్రావణ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, భౌతికకాయానికి నివాళులర్పించిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్.
Devarakonda: నారాయణదాసు శ్రావణ్ మృతి బాధాకరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ: పీఏ పల్లి గ్రామానికి చెందిన నారాయణదాసు శ్రావణ్ మృతి అత్యంత బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం పీఏ పల్లి గ్రామంలో నారాయణదాసు శ్రావణ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. శ్రావణ్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని, ఆయన మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని అన్నారు.
మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి, సర్పంచ్ కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, బొడ్డుపల్లి మహేందర్, మునగాల అంజిరెడ్డి, బోలిగోర్ల కొండల్, రమావత్ శ్రీను, పేర్ల రవి తదితరులు పాల్గొన్నారు.




