Suryapet: సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ ధర్నా
Suryapet: ఎల్నినో వల్ల పంటలు ఎండిపోయిన సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
Suryapet: సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ ధర్నా
సూర్యాపేట: ఎల్నినో ప్రభావంతో పంటలు పండకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని, వేలాది ఎకరాలు బీడు భూములుగా మారిపోయాయని, సూర్యాపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు సిపిఐ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి సిపిఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని అన్నారు. సూర్యాపేట జిల్లాలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, రైతులు ఆర్థికంగా నష్టపోయారని, కాబట్టి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పంటలు నష్టపోయిన రైతులకు వరికి ఎకరానికి రూ.30,000, పత్తి, మిర్చికి రూ.50,000, ఇతర పంటలకు రూ.20,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. రైతు కూలీలకు రేషన్ దుకాణం ద్వారా 14 రకాల సరుకులు అందజేయాలని అన్నారు.
గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90 శాతం నిధులు అందజేసి, 200 రోజుల పాటు పని కల్పించాలని, రోజు కూలి రూ.650 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీటి లభ్యత లేదు కాబట్టి రబీలో పంటలు వేయవద్దని ప్రభుత్వం చెబుతుందని, కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లావుల రాములు, ఉస్తేల నారాయణరెడ్డి, ధూళిపాల ధనుంజయ నాయుడు, మేకల శ్రీనివాసరావు, బద్దం కృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎల్లంల యాదగిరి, కంబాల శ్రీనివాస్, బూర వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, దేవవరం మల్లేశ్వరి, ఎస్.కె. లతీఫ్, ఎస్.కె. సాయిబెల్లి, అనంతుల మల్లేశ్వరి, రాష్ట్ర, జిల్లా ప్రజా సంఘాల నాయకులు కొప్పోజు సూర్యనారాయణ, జడ శ్రీనివాస్, దొడ్డ వెంకటయ్య, రెమిడాల రాజు, ఎడెల్లి శ్రీకాంత్, గూగులోతు రాజారాం, మండల కార్యదర్శులు ఎర్రసాని రవి, కడియాల అప్పయ్య, చింతిర్యాల రవి, పాల్వాయి పున్నయ్య, కత్తి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మైనార్టీ నాయకులు ఎం.డి. గౌస్ పాషా, పెండ్ర కృష్ణ, వాడపల్లి వెంకన్న, అయితేగాని కామేష్, మహిళా సంఘం నాయకురాళ్లు లక్ష్మీ, రెవిడాల జయసుధ, పొదిల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.




