Miryalaguda: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు డీసీహెచ్ఎస్ భాను ప్రసాద్ వార్నింగ్!

Miryalaguda: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల తీరుపై రోగుల ఆగ్రహం నేపథ్యంలో డీసీహెచ్ఎస్ భాను ప్రసాద్ స్పందించారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 17 Nov 2026 10:38 AM IST
Miryalaguda
X

Miryalaguda: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు డీసీహెచ్ఎస్ భాను ప్రసాద్ వార్నింగ్!

Miryalaguda: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల తీరుపై రోగుల ఆగ్రహం తీరుపై స్పందించిన జిల్లా ఆసుపత్రుల సేవల సమన్యయకర్త డిసిహెచ్ఎస్ అధికారి భాను ప్రసాద్. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు తమ సమయపాలన పాటించాలని డాక్టర్లను ఆదేశించిన జిల్లా డిసిహెచ్ఎస్ అధికారి.

తమకు కేటాయించిన సమయపాలనలో విధుల్లో లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా అధికారి. ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సాధించాలి.

సెక్యూరిటీ సిబ్బంది లోపం లేకుండా చూడాలని సూపరింటెండెంట్ ను హెచ్చరించిన డిసిహెచ్ భాను ప్రసాద్. ఓపీ సమయం ముగిసే అంతవరకు ఆసుపత్రిలోనే వైద్యులు పేషెంట్లకు అందుబాటులో ఉండాలి.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA