Nalgonda: రాజగోపాల్‌రెడ్డిపై పున్న కైలాష్ నేత ఫైర్.. ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తా!
Nalgonda: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీరుపై నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత మండిపడ్డారు.
Nalgonda: రాజగోపాల్‌రెడ్డిపై పున్న కైలాష్ నేత ఫైర్.. ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తా!
Nalgonda: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీరుపై నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక యాదవ సంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో కైలాష్ నేత మాట్లాడుతూ.. మంత్రి పదవి, కాంట్రాక్టులు రాలేదన్న అక్కసుతో రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీని, ప్రభుత్వాన్ని బజారుకీడుస్తున్నారని ఆరోపించారు.
పార్టీలో ఉంటూనే కాంగ్రెస్‌ను బలహీనపరిచేలా వ్యవహరించడం తగదని, దమ్ముంటే బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టుకోవాలని సవాల్ విసిరారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని, ఆయన వ్యాఖ్యలపై ఆధారాలతో సహా ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానని కైలాష్ నేత స్పష్టం చేశారు.




