Nalgonda: దళిత కుటుంబంపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి!
Nalgonda: మిర్యాలగూడలో దీపావళి వేళ బాణసంచా పేల్చవద్దని వారించిన దళిత కుటుంబంపై కర్రలతో దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.
Nalgonda: దళిత కుటుంబంపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి!
Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గాంధీనగర్ లో దీపావళి పండుగ వేళ బాణసంచా పేల్చవద్దని చెప్పినందుకు ఓ దళిత కుటుంబంపై కర్రలతో దాడి చేశారు.
ఇంటిపైకి వచ్చి ఇష్టం వచ్చినట్లు కర్రలతో కొట్టి భయభ్రాంతులకు గురిచేశారూ. ప్రశ్నించినందుకు ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ దళిత సంఘాల ఐక్యవేదిక బాధిత కుటుంబానికి అండగా నిలిచాయి. దాడికి పాల్పడిన జగదీష్‌తో పాటు అతని అనుచరులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని డిమాండ్ చేస్తూ డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు.
దీపావళి రోజు అర్ధరాత్రి బాంబులు పేలుస్తుండగా.. అలా చేయవద్దని వారించినందుకు వివాదం మొదలైనట్లు బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో జగదీష్‌తో పాటు అతని అనుచరులు ఇంటిపైకి వచ్చి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు.
కర్రలతో కొడుతూ ఇష్టం వచ్చినట్లు దాడికి పాల్పడిన ఘటనపై బాధిత దళిత కుటుంబం న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై స్పందించిన అన్ని కుల సంఘాల నాయకులు బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు.
అన్ని కుల సంఘాల ప్రతినిధులు డీఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. జగదీష్‌తో పాటు దాడిలో పాల్గొన్న అతని అనుచరులను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని డిమాండ్ చేశారు.
రేపటిలోగా నిందితులను రిమాండ్ చేయకపోతే రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహిస్తామని పోలీసులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.




