Huzurnagar: అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: కలెక్టర్ తేజస్!
Huzurnagar: మురసు తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట, హుజూర్నగర్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు.
Huzurnagar: అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: కలెక్టర్ తేజస్!
Huzurnagar: మురసు తుఫాన్ ప్రభావంతో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా హుజూర్నగర్ డివిజన్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలను అనుసరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.




