Nalgonda: శివన్నగూడెం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం!
Nalgonda: నల్లగొండ జిల్లా శివన్నగూడెం రిజర్వాయర్ వద్ద సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మూడు రోజుల పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది.
Nalgonda: శివన్నగూడెం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం!
Nalgonda: సాగునీటి ప్రాజెక్టులపై పాలకులు అవలంబిస్తున్న అలసత్వాన్ని నిరసిస్తూ సీపీఎం చేపట్టిన మూడు రోజుల పాదయాత్ర మర్రిగూడెం మండలం శివన్నగూడెం రిజర్వాయర్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం, రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఫ్లోరైడ్ రహిత మునుగోడు ప్రాంతానికి సాగు, తాగునీరు అందించడానికి డిండి ఎత్తిపోతల పథకమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
సీపీఎం నిరంతరం పోరాటాల ద్వారానే గతంలో అనేక ప్రాజెక్టులను సాధించుకుందని గుర్తుచేశారు.2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపాదనలు సిద్ధమైనా ముందుకు పడలేదని, 2015 జూన్ లో కేసీఆర్ డిండి ప్రాజెక్టుకు మంజూరు ఇచ్చినా తగిన నిధులు కేటాయించకపోవడంతో పనులు నెమ్మదించాయని విమర్శించారు.
ప్రాజెక్టు పరిధిలోని 9 రిజర్వాయర్లలో 7 రిజర్వాయర్లు వివిధ దశల్లో ఉండగా, రెండింటి పనులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. 2025 జనవరిలో రూ. 1,800 కోట్లతో హెడ్ వర్క్స్ టెండర్లు పిలిచినా ఒక్క పని కూడా మొదలుకాలేదని మండిపడ్డారు.




