Nalgonda: నవంబర్ 15న నల్గొండలో సీపీఎం భారీ బహిరంగ సభ: సుధాకర్ రెడ్డి!

Nalgonda: నవంబర్ 15న నల్గొండ ఎన్జీ కాలేజీ మైదానంలో అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఎం నేత ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 6 Nov 2026 5:04 PM IST
Nalgonda
X

Nalgonda: నవంబర్ 15న నల్గొండలో సీపీఎం భారీ బహిరంగ సభ: సుధాకర్ రెడ్డి!

Nalgonda: అఖిలభారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 15న నల్గొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్‌లో సయ్యద్ హశం అధ్యక్షతన జరిగిన నల్గొండ నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు.​

కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. విదేశీ వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసి దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తేవడం, ఉపాధి హామీని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.​నవంబర్ 15 నుంచి 18 వరకు జాతీయ మహాసభలు జరుగుతాయని తెలిపారు.

15న మర్రిగూడ బైపాస్ నుండి ఎన్జీ కాలేజీ వరకు ‘రెడ్ షర్ట్-రెడ్ శారీ’ కవాతు, డప్పు వాయిద్యాలు, కోలాటాలతో భారీ ప్రదర్శన ఉంటుందన్నారు. అలాగే 14 నుండి 16 వరకు పాత R&B స్థలంలో ఆధునిక వ్యవసాయ పరికరాలు, వంగడాలతో 'అగ్రి షో' నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలడుగు నాగార్జున, ప్రభావతి, సలీం తదితరులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET