Nalgonda: నల్లగొండలో సీపీఎం ఆధ్వర్యంలో సాయుధ పోరాట వార్షికోత్సవం!

Nalgonda: సాయుధ రైతాంగ పోరాటానికి మత రంగు పులిమి బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఎం నేత ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి విమర్శ. నల్లగొండలో సాయుధ పోరాట వార్షికోత్సవం నిర్వహణ.

Saleem, Nalgonda
Published on: 17 Sept 2026 9:47 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో సీపీఎం ఆధ్వర్యంలో సాయుధ పోరాట వార్షికోత్సవం!

నల్గొండ: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన చారిత్రక ఉద్యమమని, దానికి మత రంగు పులుముతూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి విమర్శించారు. గురువారం నల్లగొండలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

​రైతాంగ పోరాట స్ఫూర్తితోనే ఉద్యమాలు

తెలుగు భాష పరిరక్షణ కోసం మొదలైన ఉద్యమం, ఆ తర్వాత ‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదంతో సాయుధ పోరాటంగా మారిందని గుర్తుచేశారు. నైజాం నవాబులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను వేధించిన దొరలు, పటేల్, పట్వారీలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని తెలిపారు. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే నేడు కేంద్ర ప్రభుత్వం తెస్తున్న రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda