Suryapet: కోదాడలో ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేతల ఘన నివాళులు!

Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 19 Nov 2026 12:34 PM IST
Suryapet
X

Suryapet: కోదాడలో ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేతల ఘన నివాళులు!

Suryapet: భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వరి, మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఇందిరా గాంధీ సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా వారు ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD