Nalgonda: రైతుల పట్ల కాంగ్రెస్‌ది నేరపూరిత చర్య: జగదీష్ రెడ్డి

Nalgonda: కనగల్ మండలం తెలకంటిగూడెంలో ఎండిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. కాంగ్రెస్ సర్కార్‌ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

THIRUMANI SRISAILAM, MUNUGODU
Published on: 20 Sept 2026 7:07 PM IST
Nalgonda
X

Nalgonda: రైతుల పట్ల కాంగ్రెస్‌ది నేరపూరిత చర్య: జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా: కనగల్ మండలం తెలకంటి గూడెం గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి.. రైతులతో మాట్లాడి పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పి అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

అలాగే అక్కడే ఎండిన పంటపొలాల పక్కనే ఉన్న సబ్ స్టేషన్ ను సందర్శించి.. లాగ్ బుక్ పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.

మాజీమంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..

రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది నేరపూరిత చర్య.

కృష్ణాకు నీళ్లొచ్చినా పంటలు ఎందుకు ఎండబెడుతున్నరు.

నీళ్లు, కరెంట్ కష్టాల గురించి రైతుల స్పందన తెలుసుకోండి.

పంటలు ఎందుకు ఎండబెడుతున్నారో సీఎం, మంత్రులు సమాధానం చెప్పాలి.

నీళ్లు వాడుకున్నామని అబద్దం చెప్పిన ఉత్తమ్ రైతులకు ఏం సమాధానం చెపుతాడు.

ఎల్నినో ఎంత అబద్ధమో బొగ్గు కొరత కూడా అంతే అబద్దం.

రాజకీయాల కోసమే అని మాట్లాడేటోళ్లు.. పంటలు ఎండిన రైతుల వద్దకు వెళ్లి మాట్లాడాలి.

గతంలోనూ కోమటిరెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు పంటలు సాగుచేసుకోలేకపోయినమని రైతులే చెబుతున్నారు.

కేసీఆర్ వచ్చినంకనే పంటలు సాగుచేసుకుని.. బ్రహ్మాండంగా పండించుకున్నమంటున్నారు.

మళ్లీ ఈ మూడేండ్లుగా పంటలు ఎండబెడుతున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా ఎన్నాళ్లు ఎల్నినో పేరు చెప్పి డ్రామాలు అడుతారు.

ఆనాడే 21 వేల మెగావాట్ల ఫవర్ జనరేట్ చేయడానికి కావాల్సినంత చేసిండు కేసీఆర్.

కెసిఆర్ హయంలో వరుసగా నాణ్యమైన విద్యుత్తు 24 గంటలు అందించినం.

అందుకు విద్యుత్ వినియోగించుకున్న మీరంతా ప్రత్యక్ష సాక్షులే.

యాదాద్రి, భద్రాద్రి లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్లు ఎందుకు బంద్ పెట్టిండ్రు.

నీళ్లు లేవని ఒకరు, బొగ్గు లేదని మరొకరు విద్యుత్, నీళ్లు బంద్ పెడుతున్నారు.

మిల్లర్లను భయపెట్టి మిల్లులు బంద్ పెట్టిస్తున్నరు.

కోమటిరెడ్డి, ఉత్తమ్, భట్టి మీరే సమాధానం చెప్పాలి.

ఎండిన పొలాలకు ఏం సమాధానం చెబుతారో చెప్పండి.

ఇందులో రాజకీయాలు అవసరంలేదు.. రైతులకు సమాధానం కావాలి.

ఇందిరమ్మ రాజ్యమంటే రైతులను ఇబ్బందులు పెట్టడమేనా.

ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది.

వెంటనే రైతుల కు సరిపడా నీళ్లు, 24 గంటల కరెంట్ అందించాలి.

లేకుంటే రైతుల పక్షాన ఎటువంటి పోరాటానికైనా BRS పార్టీ సిద్ధంగా ఉంటది.

THIRUMANI SRISAILAM, MUNUGODU

THIRUMANI SRISAILAM, MUNUGODU