Miryalaguda: తుంగపాడు మోడల్ స్కూల్ నిధుల గోల్‌మాల్‌పై ఫిర్యాదు
Miryalaguda: మిర్యాలగూడ తుంగపాడు మోడల్ స్కూల్ నిధుల గోల్‌మాల్, ఉపాధ్యాయుల కుటుంబాల పేరిట తప్పుడు బిల్లులపై ఆర్డీవోకు గిరిజన సంఘం ఆధారాలతో ఫిర్యాదు చేసింది.
Miryalaguda: తుంగపాడు మోడల్ స్కూల్ నిధుల గోల్‌మాల్‌పై ఫిర్యాదు
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు ధీరావత్ శ్రీను నాయక్ మాట్లాడుతూ... కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చులు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహణ కోసం దేవేందర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పాఠశాలకు ఆహ్వానించి, ఆయన బ్యాంకు ఖాతాలో రూ.5,000 జమ చేసినట్లు తెలిసింది.
అదేవిధంగా ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ బ్యాంకు ఖాతాలో కూడా రూ.5,000 జమ చేసినట్లు సమాచారం ఉంది. పాఠశాలతో ప్రత్యక్ష సంబంధం లేని ఒక పాస్టర్ బ్యాంకు ఖాతాలో కూడా డబ్బులు జమ చేసినట్లు తెలిసింది. ఈ చెల్లింపులు ఏ ప్రాతిపదికన చేశారు? వాటికి సంబంధించి అధికారిక అనుమతులు, బిల్లులు, వోచర్లు ఉన్నాయా? అనే అంశాలపై విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నాము.
వివిధ వ్యక్తుల పేర్లపై బిల్లులు సమర్పించినట్లు ఉన్న ఆరోపణలు
కెమిస్ట్రీ లెక్చరర్ ఏడుపాల వెంకటరెడ్డి, తండ్రి పేరు కోటిరెడ్డి, పేరుతో బిల్లులు తయారు చేసినట్లు తెలిసింది. అదేవిధంగా తెలుగు ఉపాధ్యాయుడు విద్యాసాగర్ భార్యగా పేర్కొనబడిన ఎన్. స్రవంతి పేరుతో ఎస్టీ నిధులకు సంబంధించిన బిల్లులు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ భార్యగా పేర్కొనబడిన జి. మౌనిక పేరుతో కూడా బిల్లులు సమర్పించినట్లు తెలిసింది.
ఈ వ్యక్తుల పేర్లతో సమర్పించిన బిల్లుల వివరాలు, వారి వెండర్ నమోదు, వాస్తవంగా వస్తువులు లేదా సేవలు సరఫరా చేసిన ఆధారాలు, చెల్లింపుల వివరాలను పరిశీలించవలసిందిగా కోరుతున్నాము.
జనతా బుక్ స్టాల్ పేరుతో అధిక సంఖ్యలో బిల్లులు
ఎం. శ్రీనివాసరావు మరియు జనతా బుక్ స్టాల్ ఒకటేనని, ఆయన పేరుతో అధిక సంఖ్యలో బిల్లులు సమర్పించినట్లు తెలిసింది. ఈ బిల్లుల ద్వారా ఏయే వస్తువులు కొనుగోలు చేశారు? వాటిని పాఠశాలకు వాస్తవంగా సరఫరా చేశారా? సంబంధిత స్టాక్ రిజిస్టర్లలో నమోదు చేశారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలి




