Suryapet: ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబానికి ఆసరా పెన్షన్.. ఎంపీడీవోకు ఫిర్యాదు!

Suryapet: కుంటపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబానికి అనర్హంగా అందుతున్న ఆసరా పెన్షన్‌ను విచారించి రద్దు చేయాలని ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 31 Oct 2026 1:33 PM IST
Suryapet
X

Suryapet: ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబానికి ఆసరా పెన్షన్.. ఎంపీడీవోకు ఫిర్యాదు!

Suryapet: సూర్యాపేట జిల్లా మండలంలోని కుంటపల్లి గ్రామంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ మంజూరు చేస్తున్నారంటూ కొడి లింగయ్య అనే వ్యక్తి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కుంటపల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబంలో ఇద్దరు కుమారులు ఒకరు రైల్వే శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఆ కుటుంబానికి చెందిన లబ్ధిదారునికి ఆసరా పెన్షన్ అందుతున్నట్లు ఆరోపించారు.

ఈ విషయంపై గతంలో కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ పొందుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లబ్ధిదారునిపై సమగ్ర విచారణ జరిపించాలని, అర్హత లేకుండా పెన్షన్ పొందినట్లు నిర్ధారణ అయితే పెన్షన్‌ను రద్దు చేయడంతో పాటు ఇప్పటివరకు చెల్లించిన ప్రభుత్వ నిధులను తిరిగి రికవరీ చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కొడి లింగయ్య విజ్ఞప్తి చేశారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy