Nalgonda: నల్లగొండ అధికారుల సంక్షేమ సంఘం (NOVA) నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!

Nalgonda: నల్లగొండ అధికారుల సంక్షేమ సంఘం (నోవా) నూతన కార్యవర్గానికి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు.

Saleem, Nalgonda
Published on: 19 Oct 2026 4:04 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ అధికారుల సంక్షేమ సంఘం (NOVA) నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!

Nalgonda: నూతనంగా ఏర్పాటైన ‘నల్గొండ అధికారుల సంక్షేమ సంఘం’ (నోవా) జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఎన్నికైన నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

​స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో ‘నోవా’ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం చైర్మన్‌గా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, అధ్యక్షుడిగా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి. విజయేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సతీష్ కుమార్, కోశాధికారిగా ఎండి అక్బర్ అలీ, ఉపాధ్యక్షులుగా శశికళ, గిరిధర్ ఎంపికయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా యు.

వెంకటేశ్వర్లు, శాంతకుమారి, ఏ. సంజీవ, కమలాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పి. సాహితీ, లావణ్య కుమారి, వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కోరగా, నూతన కమిటీకి జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda