Nalgonda: ద్విచక్రవాహనంపై ఆసిఫ్‌నగర్ కాలువను పరిశీలించిన కలెక్టర్!
Nalgonda: నార్కట్‌పల్లి వద్ద ద్విచక్రవాహనంపై ఆసిఫ్‌నగర్ కాలువను పరిశీలించిన కలెక్టర్ చంద్రశేఖర్. వి.బి.జి.రాంజీ పథకం కింద పూడికతీత పనులకు ఆదేశం.
Nalgonda: ద్విచక్రవాహనంపై ఆసిఫ్‌నగర్ కాలువను పరిశీలించిన కలెక్టర్!
Nalgonda: ఆసిఫ్‌నగర్ కాలువలో పూడికతీతతో పాటు గుర్రపుడెక్క, నాచు, తూటి ఆకులను తొలగించేందుకు వి.బి.జి.రాంజీ పథకం కింద తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. నార్కట్‌పల్లి మండలం అక్కినేపల్లి నుంచి చిప్పలపల్లి వరకు సుమారు 4.5 కిలోమీటర్ల మేర కాలువ పరిస్థితిని మంగళవారం ఆయన ద్విచక్రవాహనంపై వెళ్లి స్వయంగా పరిశీలించారు.
కాలువలో వ్యర్థాలు పేరుకుపోవడంతో దిగువ ఆయకట్టుకు నీరందడం లేదని గుర్తించిన కలెక్టర్.. అవసరమైన ప్రాంతాల్లో పూడికతీత పనులకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని డిఆర్‌డిఓ శేఖర్‌రెడ్డిని ఆదేశించారు. ఉపాధి పనులు చేపట్టే ప్రతి గ్రామంలోనూ గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేయాలన్నారు. కాలువ మరమ్మతులకు వీలుగా మార్చి, ఏప్రిల్ నెలల్లో నీటి సరఫరాను నిలిపివేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.




