Nalgonda: ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను ఆదా చేయాలి!
Nalgonda: ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను ఆదా చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు.
Nalgonda: ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను ఆదా చేయాలి!
Nalgonda: ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను ఆదా చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ సందర్భంగా రెడ్కో ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 7 వరకు చేపట్టనున్న ‘సేవ్ ఎనర్జీ’ వారోత్సవాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం అధికారులతో ప్రతిజ్ఞ చేయించి, ‘జన జాతీయ గౌరవ దివస్’ గోడపత్రికను ఆవిష్కరించారు.పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు విద్యుత్ ఆదాపై అవగాహన కల్పించాలి. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు కాంతి ధారాళంగా వచ్చే చోట్ల ఫ్యాన్లు, లైట్లు ఆపేయాలి.
ఎయిర్ కండీషనర్లను 25 డిగ్రీల వద్దే ఉంచాలి. విద్యుత్ పొదుపు వివరాలను పిల్లల డైరీల్లో నమోదు చేయించడం ద్వారా తల్లిదండ్రులకూ అవగాహన కల్పించాలని కోరారు.




