Nalgonda: పంట రుణాల పంపిణీలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్ హెచ్చరిక!
Nalgonda: నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్ దృష్ట్యా రైతులకు విస్తృతంగా పంట రుణాలు మంజూరు చేయాలని డీసీసీబీ అధికారులను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.
Nalgonda: పంట రుణాల పంపిణీలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్ హెచ్చరిక!
నల్గొండ: యాసంగి సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు విరివిగా పంట రుణాలు మంజూరు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లగొండలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో పంట రుణాలు, బ్యాంకు కార్యకలాపాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రుణాలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని తేల్చి చెప్పారు. కొత్తగా వ్యవసాయం చేస్తున్న రైతులకు రుణాలు అందేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రుణం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.




