Suryapet: కోహెన్స్ ఫార్మా మూసివేత దిశగా సీపీఐ పోరాటం ఘన విజయం!

Suryapet: సూర్యాపేటలో సీపీఐ చేపట్టిన ఆందోళనలతో అధికారిక ఆదేశాల మేరకు కోహెన్స్ ఫార్మాకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తెలిపారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 6 Nov 2026 6:06 PM IST
Suryapet
X

Suryapet: కోహెన్స్ ఫార్మా మూసివేత దిశగా సీపీఐ పోరాటం ఘన విజయం!

సూర్యాపేట: కోహెన్స్ ఫార్మా (సువెన్ కంపెనీ) మూసివేతకు సంబంధించి వచ్చిన అధికారిక ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు కంపెనీకి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గత మూడు రోజులుగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలు, నిరసనలు ఫలితంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.

కంపెనీ సమస్యపై సీపీఐ నాయకులు నిరంతరం పోరాటం నిర్వహిస్తూ విద్యుత్ శాఖ అధికారులు ఎ స్సీ , ఏ ఈ ఈరోజు కలిసి సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రజల పక్షాన, బాధితుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సాగించిన పోరాటంలో ఇది కీలక ముందడుగు అని సీపీఐ నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు చేసే పోరాటాలు ఎప్పటికీ వృథా కావని, ఐక్య పోరాటాలతో ప్రజా సమస్యలకు పరిష్కారం సాధించవచ్చని అన్నారు.

కోహెన్స్ ఫార్మా మూసివేతకు సంబంధించిన ఆదేశాలు అమలవడం సీపీఐ పోరాటానికి ఘన విజయమని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు ఎండి పాషా, ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు ధరావత్ శివరాం తండా వాస్తవ్యులు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA