Munugode: మునుగోడు పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో అండగా నిలుస్తోంది: ఎమ్మెల్సీ!
Munugode: మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ మండలాల లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మునుగోడు సీపీఐ కార్యాలయంలో అందజేశారు.
Munugode: మునుగోడు పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో అండగా నిలుస్తోంది: ఎమ్మెల్సీ!
మునుగోడు: నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో అండగా నిలుస్తోందని శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. ఆయన సహకారంతో మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ మండలాలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం మునుగోడులోని సీపీఐ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామన్నారు.




