Thungathurthi: మద్దిరాలలో పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
Thungathurthi: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా మద్దిరాలలో అనారోగ్య బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు అందజేశారు.
Thungathurthi: మద్దిరాలలో పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల పరిధిలోని గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఆదేశాల మేరకు, మద్దిరాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పచ్చిపాల వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మంజూరైన చెక్కుల వివరాలు ఇలా ఉన్నాయి.
కొండ ధనంజయ్ – రూ.60,000 సూరారపు మల్లయ్య – రూ.20,౦౦౦, అక్కెనపల్లి లింగమ్మ – రూ.16,000
ఈ సందర్భంగా పేద ప్రజలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం పట్ల లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మక్కా వీరన్న, వార్డు సభ్యులు గంగుల వీరమల్లు, సుంచు సురేష్, మండల నాయకులు సయ్యద్ కుత్బుద్దిన్, తుంగతుర్తి మార్కెట్ డైరెక్టర్ నాసిర్ ఖాన్, గ్రామ నాయకులు సుంచు మధు, సుంచు గోపయ్య, కోల కృష్ణ, యూత్ సభ్యులు కోల మధుకర్, ఎడవెల్లి సంతోష్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొబ్బిలి వెంకన్న, మండల సేవాదళ్ అధ్యక్షుడు వల్లపు రమేష్, మామిళ్లమడవ గ్రామ శాఖ అధ్యక్షుడు వాసంపల్లి వెంకటరెడ్డి, ఆంగో బిక్షం, కాబట్టి కిరణ్, ముకుందాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు మీసాల బాలకృష్ణ, మండల సీనియర్ నాయకులు పులిగిల్ల లింగన్న, మాజీ ఉపసర్పంచ్ ఉబ్బని రవికుమార్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




