Nalgonda: అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి!

Nalgonda: నవంబరు 15 నుంచి 18 వరకు నల్గొండలో జరగనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కోరారు.

Saleem, Nalgonda
Published on: 10 Nov 2026 12:20 PM IST
Nalgonda
X

Nalgonda: అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి!

Nalgonda: నవంబరు 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయంవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎంబీ సలీం పిలుపునిచ్చారు.

మంగళవారం పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పెదగడియారం సెంటర్‌లో మానవహారం చేపట్టి సంఘీభావం తెలిపారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ పోరాట గడ్డ అయిన నల్గొండలో జాతీయ రైతు మహాసభలు జరగడం అభినందనీయమన్నారు. కార్మిక-కర్షక మైత్రితో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

విచ్చేస్తున్న జాతీయ నాయకులకు స్వాగతం పలుకుతూ బహిరంగ సభలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్ హశం, లకపాక రాజు, సత్తయ్య, అవుట రవీందర్, నరసింహ, మారయ్య, లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda