Chityala: నేరడలో చోరీ కేసు.. వారం రోజుల్లో నిందితుడి అరెస్ట్
Chityala: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడలో పట్టపగలు ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు; రూ.5 లక్షల నగదు, బంగారం, బైక్ స్వాధీనం.
Chityala: నేరడలో చోరీ కేసు.. వారం రోజుల్లో నిందితుడి అరెస్ట్
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఈ నెల 16వ తేదీన సాగర్ల నర్సింహ తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం భావి వద్దకు వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం వచ్చి చూడగా తాళం వేసిన ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో పెట్టిన నగదు ఐదు లక్షల రూపాయలు 2.5 గ్రాముల బంగారు దిద్దులు దొంగలించికెళ్లారు.
కేసు నమోదు చేసిన చిట్యాల పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని పట్టుకున్నారు నిందితుడు అదే గ్రామానికి చెందిన కడారి రాఘవేందర్ గా గుర్తించారు.
నిందితుడి వద్ద నుండి 5 లక్షల రూపాయలు 2.5 గ్రాముల బంగారు ఆభరణాలు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనపరచుకొని నిందితున్ని రిమాండ్ కు తరలించినట్లు నార్కట్ పల్లి సిఐ సురేష్ తెలిపారు.




