Nakrekal: చిట్యాలలో చేయూత పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన వేముల వీరేశం!
Nakrekal: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
Nakrekal: చిట్యాలలో చేయూత పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన వేముల వీరేశం!
నకిరేకల్: చిట్యాల మున్సిపాలిటీలో ప్రభుత్వం మంజూరు చేసిన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం చిట్యాల వ్యవసాయ మార్కెట్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలో 4 లక్షలకు పైగా లబ్ధిదారులకు నూతన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, వికలాంగులు, చేనేత కార్మికులు, వితంతువులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు ఈ దఫా పింఛన్ అందిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసినా, వాటిని భరిస్తూ ఈ ప్రభుత్వం సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్ సౌకర్యం, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు కల్పించిందని అన్నారు. నియోజకవర్గంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
చిట్యాల మున్సిపాలిటీకి నూతన మున్సిపాలిటీ బిల్డింగ్ మంజూరు అయ్యిందని, త్వరలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మరియు 30 పడకల దవాఖానా మున్సిపాలిటీకి మంజూరు చేయనున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి , చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీత రమేష్ , వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు కౌన్సిలర్లు నాగిళ్ళ సుధాకర్ , గాలి యాదమ్మ లింగయ్య , కోనేటి ఎల్లయ్య , జెర్రిపోతుల సత్యనారాయణ గారు, దేశపాక లత రాజేష్ , కుక్కుల మోహన్ , ఏర్పుల పరమేష్ బొబ్బలి సందీప్ రాంరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి పోకల దేవదాస్ , టౌన్ అధ్యక్షులు ఎద్దులపూరి కృష్ణ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




