Chityal: చిట్యాల వట్టిమర్తి స్టేజి వద్ద అశోక్ లేలాండ్ సర్వీసింగ్ సెంటర్ ప్రారంభం!
Chityal: చిట్యాల మండలం వట్టిమర్తి స్టేజి వద్ద అశోక్ లేలాండ్ సర్వీసింగ్ పాయింట్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
Chityal: చిట్యాల వట్టిమర్తి స్టేజి వద్ద అశోక్ లేలాండ్ సర్వీసింగ్ సెంటర్ ప్రారంభం!
Chityal: చిట్యాల మండలం వట్టిమర్తి స్టేజి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ లేలాండ్ సర్వీసింగ్ & స్పేర్ పార్ట్స్ అథరైజ్డ్ సర్వీసింగ్ పాయింట్ ను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సర్వీసింగ్ పాయింట్ ద్వారా ఈ ప్రాంత లారీ యజమానులకు, డ్రైవర్లకు మెరుగైన సేవలు అందుతాయని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాహనదారులు పాల్గొన్నారు.




