Nalgonda: జీకే అన్నారం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం!

Nalgonda: నల్లగొండ జిల్లా జీకే అన్నారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.

Sowmya
Published on: 14 Nov 2026 3:46 PM IST
Nalgonda
X

Nalgonda: జీకే అన్నారం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం!

Nalgonda: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) జీకే అన్నారంలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

​ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సైదులు, ఉపాధ్యాయురాలు గౌతమి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ మైల మల్లికార్జున రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

పిల్లలు బాగా చదువుకొని దేశ భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sowmya

Sowmya