Nadigudem: నడిగూడెం మండలం రత్నవరంలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం!
Nadigudem: నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం చేయూత పింఛన్లు పంపిణీ చేశారు. మొక్క బిక్షపతి, తిరుపతమ్మ సుధీర్ పాల్గొన్నారు.
Nadigudem: నడిగూడెం మండలం రత్నవరంలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం!
నడిగూడెం: మండల పరిధిలోని రత్నవరం గ్రామంలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొక్క బిక్షపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.




