Narketpally: నార్కట్ పల్లిలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ!

Narketpally: నార్కట్ పల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం చేయూత పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 16 Nov 2026 2:18 PM IST
Narketpally
X

Narketpally: నార్కట్ పల్లిలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ!

నార్కట్ పల్లి: నార్కట్ పల్లి మండల MPDO కార్యాలయంలో నిర్వహించిన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొని నార్కట్ పల్లి, గొపలాయిపల్లి, యెడవెల్లి, పోతినేనిపల్లి, ఏపీ లింగోటం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను అందజేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలో 4 లక్షలకు పైగా లబ్ధిదారులకు నూతన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, వికలాంగులు, చేనేత కార్మికులు, వితంతువులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు ఈ దఫా పింఛన్ అందిస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసినా, వాటిని భరిస్తూ, ఈ ప్రభుత్వం సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్ సౌకర్యం,పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు కల్పించిందని అన్నారు. నియోజకవర్గంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి మరియు ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL