Suryapet: తుంగతుర్తిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు బీఆర్‌ఎస్ పిలుపు!

Suryapet: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం. నవంబర్ 6 చివరి తేదీగా వెల్లడి.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 7 Oct 2026 3:33 PM IST
Suryapet
X

Suryapet: తుంగతుర్తిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు బీఆర్‌ఎస్ పిలుపు!

Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం: మద్దిరాల మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ మద్దిరాల మండల అధ్యక్షుడు ఎస్.ఏ. రజాక్ పిలుపునిచ్చారు. మద్దిరాల మండల పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులని తెలిపారు.

ఓటు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ కావడంతో పార్టీ శ్రేణులు గ్రామాల వారీగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారితో ఓటు నమోదు చేయించాలని సూచించారు. మద్దిరాల మండలాన్ని పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో ముందంజలో నిలపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి, లావుడియా వెంకన్న, కోడి శ్రీను, వడ్డాణం మధుసూదన్, సర్పంచ్‌లు రాంపాక నాగరాజు, మునగాల భాస్కర్ రావు, పాల్వాయి కర్ణాకర్, మారెల్లి యాకయ్య, దామర్ల వెంకన్న, బద్దం అమృతా రెడ్డి, రేసు వెంకన్న, గంగవెళ్లి రాజేందర్ ప్రసాద్ రావు, బొబ్బిలి ఉప్పలయ్య, ఎస్‌కే ఫరీద్, బుసాని ఉమామహేశ్వర్, శిరంశెట్టి వెంకన్న, వల్లపు యాకయ్య,

వెలుగు వెంకన్న, పాతూరి లింగారెడ్డి, నల్ల మధు, గాడుదుల లింగరాజు, మల్లాల నర్సయ్య, గోల్కొండ మల్లేష్, అచ్చ శరత్, రాంపాక మురళి, తాళ్లపెళ్లి బోస్, పల్లా శ్రీకాంత్, బయ్య లింగన్న, వెన్నమల్ల జలందర్, సిల్వెరు లింగరాజు, హరిసింగ్, బెడద వెంకన్న, బూర్గుల బాను, ఎడ్ల పవన్, కటకం రాజు, గువ్వ ప్రతాప్, కోమరయ్య, పోతరాజు శ్రీనివాస్, మారిశెట్టి రవికాంత్, ఎల్. వెంకన్నతో పాటు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy