Nalgonda: తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం.. బీఆర్ఎస్ వినూత్న నిరసన!

Nalgonda: నల్లగొండలో తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం చీర కట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించాయి.

Saleem, Nalgonda
Published on: 11 Oct 2026 7:17 PM IST
Nalgonda
X

Nalgonda: తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం.. బీఆర్ఎస్ వినూత్న నిరసన!

నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం చీర కట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు.

​ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేసి తమ నిరసనను వినూత్న రీతిలో తెలియజేశారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర సంస్కృతిని, అమరుల ఆశయాలను అవమానించేలా ఉందంటూ నేతలు ధ్వజమెత్తారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda