Suryapet: సూర్యాపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలు.. ఘనంగా 2కే రన్ నిర్వహించిన బిఆర్‌ఎస్!
Suryapet: సూర్యాపేట జిల్లా ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు. సద్దల చెరువు నుండి కొత్త బస్ స్టాండ్ వరకు భారీ 2కే రన్.
Suryapet: సూర్యాపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలు.. ఘనంగా 2కే రన్ నిర్వహించిన బిఆర్‌ఎస్!
Suryapet: జిల్లా ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సద్దల చెరువు నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు 2కే రన్ నిర్వహించి, జిల్లాను ఏర్పాటు చేసిన మాజీ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, పట్టణ ప్రజలు, యువత భారీగా తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు డా. గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఒంటెద్దు నరసింహ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు తర్వాత ఊహించని విధంగా సూర్యాపేట అభివృద్ధి జరిగిందన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అహర్నిశలు కృషి చేసి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీ, ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎస్ఆర్ఎస్పీ జలాలు, గురుకులాలతో పాటు నియోజకవర్గాల్లో 6 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.
ముందుచూపుతో కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు అభివృద్ధికి ముఖద్వారాలుగా నిలిచాయని, పాలన ప్రజల ముంగిటకు వచ్చిందని పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణతో అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని, క్రైం రేట్ తగ్గిందని అన్నారు. కేసీఆర్ ఒక చరిత్ర, ఒక ఉన్నత శిఖరమని, ఆయన ఆనవాళ్లు చెరిపేయాలని చూడటం మూర్ఖత్వమని, రేపటి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని నాయకులు పిలుపునిచ్చారు.




