Suryapet: అనాధ పిల్లల కుటుంబానికి బియ్యం సహాయం అందించిన బీఆర్ఎస్ నేత రజాక్!

Suryapet: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన అనాధ పిల్లలు వినయ్, వికాస్‌ల కుటుంబానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎస్.ఏ. రజాక్ 50 కిలోల బియ్యం అందించారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 29 Nov 2026 10:11 AM IST
Suryapet
X

Suryapet: అనాధ పిల్లల కుటుంబానికి బియ్యం సహాయం అందించిన బీఆర్ఎస్ నేత రజాక్!

Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రానికి చెందిన అనాధ పిల్లలు రాంపాక వినయ్, వికాస్‌ల నానమ్మ రాంపాక ఎల్లమ్మ దశదిన కర్మ సందర్భంగా వారి కుటుంబానికి మద్దిరాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్.ఏ. రజాక్ 50 కిలోల బియ్యాన్ని సహాయంగా అందించారు.

ఈ బియ్యాన్ని గ్రామ సర్పంచ్ రాంపాక నాగరాజు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో అనాధ పిల్లల కుటుంబానికి అండగా నిలిచి సహాయం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వడ్డాణం మధుసూదన్, మాజీ ఉపసర్పంచ్ మల్లాల నర్సయ్య, కోడిశాల లింగయ్య, రాంపాక మురళి, బిక్షం, చరణ్, గోల్కొండ సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy