Miryalaguda: 2BHK ఇండ్ల పంపిణీపై వివాదం.. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా!
Miryalaguda: మిర్యాలగూడలో గతంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులను తొలగించి, కాంగ్రెస్ నాయకులకు 2BHK ఇళ్లను కేటాయిస్తున్నారంటూ బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు.
Miryalaguda: 2BHK ఇండ్ల పంపిణీపై వివాదం.. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా!
Miryalaguda: మిర్యాలగూడలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపకాలలో అవకతవకలు జరిగాయి అంటూ బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే డ్రా ద్వారా పంపిణీ చేయడం జరిగిందనీ నేడు లబ్ధి పొందిన వారిని తొలగించి కొత్తగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇస్తున్నారని బిఆర్ఎస్ నాయకుల ఆందోళన.
కాంగ్రెస్ నాయకులు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో రాజకీయాలు మానుకొని గతంలో పంపిణీ చేసిన వారికి మాత్రమే నేడు పంపిణీ జరపాలని కోరారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో మాకు లక్కీ డ్రా ద్వారా కేటాయించారని నేడు మా పేర్లు తొలగించి కావాలని కక్షపూరితంగా వార్డుల్లోని కౌన్సిలర్లు వారికి అనుకూలమైన వ్యక్తులకి కేటాయిస్తున్నారని అదే గనక జరిగితే రేపు పంపిణీ అడ్డుకుంటామని హెచ్చరించారు.




