Nalgonda: కూరెళ్ల వెంకట చారి మృతి బాధాకరం.. బీఆర్ఎస్ నేత భీల్యా నాయక్!

Nalgonda: నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాలకు చెందిన కూరెళ్ల వెంకట చారి మృతి పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర నేత కేతావత్ భీల్యా నాయక్ సంతాపం తెలిపారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 28 Nov 2026 1:32 PM IST
Nalgonda
X

Nalgonda: కూరెళ్ల వెంకట చారి మృతి బాధాకరం.. బీఆర్ఎస్ నేత భీల్యా నాయక్!

Nalgonda: చందంపేట మండలం చిత్రియాల గ్రామానికి చెందిన కూరెళ్ల వెంకట చారి మృతి చాలా బాధాకరమని BRS పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్ అన్నారు.

శనివారం కూరెళ్ల వెంకట చారి మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకట చారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.

ఆయన వెంట స్థానిక సర్పంచ్ చాట్ల చిరంజి, రాములు గౌడ్, కేతావత్ హరిలాల్ నాయక్ ,గ్రామ శాఖ అధ్యక్షులు రామలింగం, వార్డ్ సభ్యులు రజినీకాంత్, తుమ్మల చెన్నయ్య, మార్క్ యాదయ్య , జైపాల్ రెడ్డి ,చిన్న అంజన్ గౌడ్,నిరంజన్ గౌడ్, వేణు, తదితరులు ఉన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA