Kodad: చిరుధాన్యాల వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యం.. బీజేపీ అవగాహన!

Kodad: సూర్యాపేట జిల్లా కోదాడలో బీజేపీ ఆధ్వర్యంలో చిరుధాన్యాల వినియోగంపై ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు రాగి, జొన్న జావ, సహజ పానీయాలను అందించారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 29 Nov 2026 1:13 PM IST
Kodad
X

Kodad: చిరుధాన్యాల వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యం.. బీజేపీ అవగాహన!

Kodad: ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కోదాడ పట్టణంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న బాయ్స్ స్కూల్ పక్కన మహిళా శక్తి ఆధ్వర్యంలో ప్రజలకు రాగి జావ, జొన్న జావతో పాటు వివిధ రకాల సహజ పానీయాలను అందించారు.

ఈ సందర్భంగా చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. రాగి, జొన్న వంటి చిరుధాన్యాల్లో పీచు పదార్థాలు, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, వీటి వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. అలాగే క్యారెట్, బీట్‌రూట్, సొరకాయ, బూడిద గుమ్మడికాయ, కాకరకాయ, మునగాకు, కొత్తిమీరతో తయారు చేసిన వివిధ రకాల జ్యూస్‌లను ప్రజలకు అందించారు.

పూర్వీకులు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం సాగించేవారని, ప్రస్తుత కాలంలో ఫాస్ట్‌ఫుడ్, అధిక నూనె పదార్థాలు, జంక్‌ఫుడ్ వినియోగం పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. ప్రజలు చిరుధాన్యాల ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.

మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు చిరు వ్యాపారాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మహిళా శక్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆరోగ్యం ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉందని, పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రవాస కన్వీనర్ జల్లా జనార్ధన్ రావు, బీజేపీ మహిళా నాయకురాలు పెంటి విజయలక్ష్మి, జిల్లా ఓబీసీ కోశాధికారి హనుమాన్ చారి, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు వాంకోడోతు రమేష్ నాయక్, కోదాడ పట్టణ బీజేపీ నాయకులు మునగ నరేష్, పత్తి సుబ్రహ్మణ్యం, కుంబజడ గోపి, లలిత, బువ్వమ్మ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు పాల్గొన్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD