Nalgonda: నల్గొండలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ!

Nalgonda: కాంగ్రెస్ ఎంపీ భీమోల్ అకోయిజామ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీజేపీ, మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 13 Oct 2026 5:44 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ!

Nalgonda: మణిపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ భీమోల్ అకోయిజామ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీజేపీ, మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, 11 మంది విద్యార్థినుల ఫిర్యాదుల నేపథ్యంలో అంతర్గత కమిటీ విచారణ అనంతరం జేఎన్‌యూ యాజమాన్యం భీమోల్ అకోయిజామ్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం తీవ్రమైన విషయమని పేర్కొన్నారు.

ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ జరిపి, బాధిత విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.మహిళల హక్కుల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకత్వం ఈ వ్యవహారంపై స్పష్టమైన సమాధానం చెప్పాలని కోరారు. భీమోల్ అకోయిజామ్‌ను పార్టీ నుంచి తొలగించాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వెళ్తున్న మహిళా మోర్చా నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదన్నారు.బాధిత విద్యార్థినులకు న్యాయం జరిగే వరకు బీజేపీ, మహిళా మోర్చా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET