Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్లలో బీసీలకు తీవ్ర అన్యాయం కట్టెకోలు దీపెందర్!
Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ విమర్శ.
Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్లలో బీసీలకు తీవ్ర అన్యాయం కట్టెకోలు దీపెందర్!
Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కులగణన జరిపి సామాజిక న్యాయం చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్, నల్గొండ నియోజకవర్గాల పరిధిలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లు కేటాయించడం బడుగు, బలహీన వర్గాలను అవమానించడమేనన్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న 'ఎవరి వాటా వారికి' అనే సూత్రం ఇక్కడ అమలవుతుందా అని ప్రశ్నించారు.




