Miryalaguda: మిర్యాలగూడలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరణ!

Miryalaguda: మిర్యాలగూడలోని జ్యోతిరావు పూలే భవనంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరణ. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 21 Oct 2026 3:00 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరణ!

Miryalaguda: పండుగ సాయన్న జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని బీసీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతిరావు పూలే భవనంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి కార్యక్రమం, వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

బీసీ జేఏసీ మిర్యాలగూడ నియోజకవర్గ కో-కన్వీనర్లు దాసరాజు జయరాజు, చేగొండి మురళీ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా 21వ వార్డు కౌన్సిలర్ వెలుగు ఇందిర నాగరాజు హాజరై పండుగ సాయన్న జయంతి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పండుగ సాయన్న జయంతి ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, ఆయన జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం సంతోషకరమని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాగరాజు, పున్న రాములు, కంచి సత్యనారాయణ, పిల్లలమర్రి రవికుమార్, బోయపాటి రవీందర్ గౌడ్, దువ్వ చంద్రశేఖర్, నల్లబోతు నవీన్ యాదవ్, తిరుపతయ్య, పూర్ణచందర్, శ్రీధర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA