Chandur: చందూర్ విక్టరీ హైస్కూల్‌లో అట్టహాసంగా బతుకమ్మ సంబురాలు!

Chandur: చందూర్ విక్టరీ హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బాన్సువాడ ఎమ్మెల్యే. మహిళలు, విద్యార్థుల కోలాటాలు, పూజా కార్యక్రమాలు.

SALEEM, BANSWADA
Published on: 11 Oct 2026 7:20 PM IST
Chandur
X

Chandur: చందూర్ విక్టరీ హైస్కూల్‌లో అట్టహాసంగా బతుకమ్మ సంబురాలు!

Chandur: చందూర్ మండల కేంద్రo లోని విక్టరీ హై స్కూల్ లో ఈ రోజు బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు.ముఖ్య అతిథిగా బాన్సువాడ శాసన సభ్యులు పాల్గొని,పూజలు నిర్వహించారు.అనంతరం చందూర్ గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మహిళల ఆనందోత్సాహాల మధ్య సందడిగా సాగాయి.విక్టరీ స్కూల్ ప్రిన్సిపాల్ రామారావు తమ పాఠశాలలో కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమoలో చందూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA