Burugadda: ఘనంగా అయ్యప్ప స్వాముల కుటుంబ కార్తీక వన సమారాధన

Burugadda: బూరుగడ్డ శ్రీ ఆది వరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ మంజునాథ గురుస్వామి పీఠం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 15 Nov 2026 5:05 PM IST
Burugadda
X

Burugadda: ఘనంగా అయ్యప్ప స్వాముల కుటుంబ కార్తీక వన సమారాధన

బూరుగడ్డ: శ్రీ మంజునాథ గురుస్వామి పీఠం అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో కుటుంబ కార్తీక వన సమారాధన, వనభోజన కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బూరుగడ్డ గ్రామంలోని శ్రీ ఆది వరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా గురుస్వామి మంజునాథ శ్రీను మాట్లాడుతూ.. కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష స్వీకరించి 41 రోజుల మండల దీక్షను నిష్ఠతో ఆచరించే స్వాములకు వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లులు, భార్యలు, పిల్లలు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో సహకరిస్తారని తెలిపారు.

స్వాముల కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందంగా గడిపేందుకు గత నాలుగు సంవత్సరాలుగా స్వాముల ఆర్థిక సహకారంతో సమిష్టి కుటుంబ వనభోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా చలికంటి లక్ష్మణ్ గురుస్వామి పాటలు, ఆకుల రాము డప్పు వాయిద్యాలు, భజనలతో అయ్యప్ప నామస్మరణలు ఆలయ ప్రాంగణమంతా మారుమోగాయి. మహిళా భక్తులు ఉసిరి చెట్టుకు దీపారాధన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమానికి హుజూర్‌నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, పలువురు గౌరవ కౌన్సిలర్లు హాజరై స్వామివారిని దర్శించుకుని అయ్యప్ప స్వాముల కార్యక్రమంలో పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR