Nalgonda: దేవరకొండలో నీటి, విద్యుత్ పొదుపుపై పురపాలక సంఘం అవగాహన కార్యక్రమం!

Nalgonda: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో దేవరకొండ పురపాలక సంఘం 5, 18 వార్డులలో నీటి, విద్యుత్ పొదుపుపై ప్రజలకు మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 6 Nov 2026 1:59 PM IST
Nalgonda
X

Nalgonda: దేవరకొండలో నీటి, విద్యుత్ పొదుపుపై పురపాలక సంఘం అవగాహన కార్యక్రమం!

Nalgonda: దేవరకొండ పురపాలక సంఘం పరిధిలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి మరియు విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు 5వ మరియు 18వ వార్డులలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు నీటి ప్రాముఖ్యత, వర్షపు నీటి సంరక్షణ, నీటి వృథా నివారణ, విద్యుత్ పొదుపు మరియు సహజ వనరుల సద్వినియోగంపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో నీటి కొరత వంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, అవసరం లేని సమయంలో విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి నేనావత్ శ్రీకన్య–సేవ్య గారు, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ సకృ నాయక్, వార్డు అధికారులు ఆనంద్, ఝాన్సీ, పద్మ, మెప్మా ఆర్‌పీలు, మహిళా సంఘాల సభ్యులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు నీటిని కాపాడుదాం విద్యుత్‌ను ఆదా చేద్దాం భవిష్యత్తును భద్రపరుచుకుందాం.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA