Nalgonda: వేములపల్లి రైస్ మిల్లులో విషాదం..బాయిలర్‌లో పడి కార్మికుడు మృతి!
Nalgonda: వేములపల్లి మండలం శెట్టిపాలెం మహాతేజ రైస్ మిల్లులో బాయిలర్‌లో పడి అసిస్టెంట్ డ్రైవర్ నాగరాజు మృతి చెందడంతో, కుటుంబ సభ్యులు హైవేపై ధర్నా నిర్వహించారు.
Nalgonda: వేములపల్లి రైస్ మిల్లులో విషాదం..బాయిలర్‌లో పడి కార్మికుడు మృతి!
Nalgonda: వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద మహాతేజ రైస్ మిల్లులో విషాదం చోటు చేసుకుంది. మండలి నాగరాజు అనే వ్యక్తి మహాతేజ మిల్లులోని అసిస్టెంట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రోజువారిగా మిల్లు నడుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బాయిలర్లు లో పడి మరణించడంతో కుటుంబంలోని విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఘటనని తెలుసుకున్న కుటుంబ సభ్యులు మిల్లు వద్దకు చేరుకునీ మృతదేహాన్ని మిల్లు వద్ద ఉంచి.
ఎదురుగా ఉన్న అద్దంకి నార్కట్పల్లి హైవేపై మృతుని భార్య, ఇద్దరు కుమార్తెలతో పాటు కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.




