Suryapet: ఈ నెల 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె!

Suryapet: ఎన్నికల హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతూ ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని సూర్యాపేటలో ఆశా వర్కర్లు స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 12 Nov 2026 4:30 PM IST
Suryapet
X

Suryapet: ఈ నెల 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె!

Suryapet: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశా వర్కర్లు మండిపడుతున్నారు. మూడేళ్లు గడుస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీలు అమలు అయ్యేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డిని ఆశా వర్కర్లు, వారి అనుబంధ సంఘం నాయకులు కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ తమను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమ చావు కోరుతున్నట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జీతాలు సరిగా ఇవ్వడం చేతకాదు కానీ, యాక్సిడెంట్ బీమా తమకెందుకని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకే ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. హామీలు అమలు అయ్యేంత వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ఈ సమ్మెకు మద్దతివ్వాలని, ఆశాలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కోరారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA