Nalgonda: మెకానిక్ షెడ్డును తలపిస్తున్న నల్లగొండ పశుసంవర్ధక శాఖ కార్యాలయం!
Nalgonda: నల్లగొండ జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయం నిరుపయోగ వాహనాలతో మెకానిక్ షెడ్డును తలపిస్తోందని, నిలదీస్తే దబాయిస్తున్నారని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు.
Nalgonda: మెకానిక్ షెడ్డును తలపిస్తున్న నల్లగొండ పశుసంవర్ధక శాఖ కార్యాలయం!
Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఒక మెకానిక్ షెడ్డును తలపిస్తోందని పట్టణ వాసులు ఆరోపించారు.
ఈ ఆఫీస్ ఆవరణలోకి ప్రవేశించగానే మరమ్మతులకు గురైన వాహనాలు దర్శనమిస్తుండటంతో పాటు, అధికారులకు, రైతులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ అడ్డదిడ్డంగా వెహికల్స్ నిలిపివేసి, ప్రశ్నించిన వారిని దబాయిస్తున్నరాని ఆరోపించారు.




