Munagala: రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే పద్మావతి

Munagala: సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెంలో రూ.12 లక్షలతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ప్రారంభించారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 12 Nov 2026 8:26 PM IST
Munagala
X

Munagala: రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే పద్మావతి

మునగాల: మండలంలోని నారాయణగూడెం గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. చిన్నారులకు మెరుగైన వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో నూతన అంగన్వాడీ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD