Huzurnagar: మోడల్ కాలనీలో అర్హులకే ఇండ్లు: చైర్మన్ శ్రీనివాస్ గౌడ్
Huzurnagar: హుజూర్‌నగర్ మోడల్ కాలనీలో అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆర్డీవో శ్రీనివాస్‌ను కోరారు.
Huzurnagar: మోడల్ కాలనీలో అర్హులకే ఇండ్లు: చైర్మన్ శ్రీనివాస్ గౌడ్
Huzurnagar: పట్టణంలో అర్హులకు మాత్రమే మోడల్ కాలనీలో ఇండ్లు మంజూరు చేయాలని హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గారు కోరారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాస్, మరియు కౌన్సిలర్లు తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారులు ప్రకటించిన 1434 మంది అర్హుల జాబితాతో పాటు అరుణ జాబితాను కూడా విడుదల చేయడంపై చర్చించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అర్హులకు మాత్రమే ఇండ్లు మోడల్ కాలనీలో అందించాలని కోరారు.
అర్హత కలిగిన వారికిమరో అవకాశం కల్పించాలని ఆర్డీవోను మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు కోరారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి పాటుపడుతున్నన్నారు. నిలువ నీడలేని పేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.




