Hyderabad: నాంపల్లిలో అఖిల భారత మహిళా జర్నలిస్టుల సమ్మేళనం!

Hyderabad: హైదరాబాద్ నాంపల్లి మీడియా అకాడమీలో నిర్వహించిన అఖిల భారత మహిళా జర్నలిస్టుల సమ్మేళన సాంస్కృతిక వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 24 Oct 2026 9:25 PM IST
Hyderabad
X

Hyderabad: నాంపల్లిలో అఖిల భారత మహిళా జర్నలిస్టుల సమ్మేళనం!

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నాంపల్లి మీడియా అకాడమీలో అఖిల భారత మహిళా జర్నలిస్టుల సమ్మేళనంలో భాగంగా నేడు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళా జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా నాలుగో స్తంభంగా నిలుస్తుందని, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు విశేషమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.ముఖ్యంగా మహిళా జర్నలిస్టులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వృత్తిపట్ల అంకితభావంతో పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు.మహిళలు నేడు విద్య, వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలన, రాజకీయాలు, మీడియా తదితర అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు.దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా జర్నలిస్టులు ఒకే వేదికపై సమావేశమై తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలని పేర్కొన్నారు.మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.మహిళా జర్నలిస్టుల సమ్మేళనంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.మహిళా జర్నలిస్టులు సమాజంలోని అసమానతలు, మహిళల సమస్యలు, సామాజిక అంశాలపై మరింత చైతన్యం తీసుకురావాలని ఆకాంక్షించారు.మహిళలు అన్ని రంగాల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, మహిళా జర్నలిస్టులు వృత్తిపరంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సమ్మేళన నిర్వాహకులకు, పాల్గొన్న మహిళా జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET