Chinthapally: భారత త్రోబాల్ జట్టుకు చింతపల్లి అక్షిత: కేటీఆర్ అభినందన

Chinthapally: జాతీయ త్రోబాల్‌లో స్వర్ణం సాధించి భారత జట్టుకు ఎంపికైన చింతపల్లి అక్షితను కేటీఆర్ అభినందించారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆర్థిక సాయం అందించారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 10 Nov 2026 2:59 PM IST
Chinthapally
X

Chinthapally: భారత త్రోబాల్ జట్టుకు చింతపల్లి అక్షిత: కేటీఆర్ అభినందన

చింతపల్లి: చింతపల్లి మండలం చాకలి శేరిపల్లి గ్రామానికి చెందిన అక్షిత జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో నిర్వహించిన జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్న అక్షిత అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని సాధించింది.

తన ప్రతిభతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన అక్షిత తాజాగా భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.అక్షిత కు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆర్ధిక సహాయం అందించారు.చింతపల్లి మండల బిఆర్ ఎస్ పార్టీ నాయకులు అక్షిత కు ఆర్ధిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ఎంపిక కావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అక్షిత తన ప్రతిభతో తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అంతర్జాతీయ పోటీల్లోనూ అద్భుత విజయాలు సాధించి మరిన్ని పతకాలు సాధించాలని కోరుతూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నెల నవంబర్ 19 నుంచి 23 వరకు శ్రీలంకలో జరగనున్న ఆసియన్ త్రోబాల్ ఛాంపియన్‌షిప్‌లో అక్షిత భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాచర్ల శ్రీశైలం, అండేకర్ అశోక్, ఉప సర్పంచ్ పగడాల వెంకటయ్య, తండ్రి జగతయ్య,తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA