Nalgonda: ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఐక్య కూటమిని గెలిపించాలి ఐఎన్‌టీయూసీ నేతలు

Nalgonda: ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతే ధ్యేయమని నల్లగొండ డిపో వద్ద నిర్వహించిన ప్రచారంలో ఐక్య కూటమి నేతలు చంద్రయ్య, కె.ఎస్.రెడ్డి స్పష్టం.

Saleem, Nalgonda
Published on: 1 Oct 2026 7:28 PM IST
Nalgonda
X

Nalgonda: ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఐక్య కూటమిని గెలిపించాలి ఐఎన్‌టీయూసీ నేతలు

Nalgonda: ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత సాధించడమే ధ్యేయంగా పనిచేస్తున్న ఐక్య కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్‌టీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి వై.చంద్రయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి కె.ఎస్.రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ డిపో వద్ద నిర్వహించిన ప్రచారంలో కూటమి నాయకులు పాల్గొని మాట్లాడారు.

​కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే వరకు ఐక్య పోరాటాలు సాగిస్తామన్నారు. 2025 వేతన సవరణ అమలుతో పాటు పాత బకాయిలు ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. క్లాస్-3 బాణం, క్లాస్-4 నక్షత్రం గుర్తులపై ఓట్లేసి కూటమిని ఆదరించాలని కోరారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం, ఐఎన్‌టీయూసీ మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తయ్య, శ్యామ్‌సుందర్, దయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda